ఉత్తరాంఖండ్ రాష్ట్రంలో హిమాలయా పర్వతశ్రేణుల నుంచి ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో జలప్రళయం సంభవించింది. ఆ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషిమఠ్‌లో ఆదివారం మంచు చరియలు విరిగిపడడంతో గంగానదికి ఉపనది అయిన ధౌలీగంగా నదికి వరద పోటెత్తింది. ఆ నదిపై నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సమీప ప్రజలు దాదాపు 100 మందికిపైగా గల్లంతయ్యారు.