ముఖ్యంగా, తన అనుచరులతో కలిసి పోయేస్ గార్డెన్‌కు వెళ్లిన ఆమెను వేదనిలయంలోకి వెళ్లకుండా ఆమె సోదరుడు దీపక్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ తన మేనత్త జయలలితను శశికళతో కలిసి తన సొంత తమ్ముడు దీపక్ చంపేశాడని ఆరోపించారు. శశికళతో కుమ్మక్కై తన సోదరుడే అత్త (జయలలిత)ను అంతమొందించాడని, ఇప్పుడు దినకరన్‌తో చేతులు కలిపి తనను అంతమొందించాలనుకుంటున్నాడని ఆరోపించారు.