హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు- కొట్టుకుపోయిన గ్రామం.. ఆరుగురు మృతి.. 53మంది గల్లంతు

వరుణ్

ఆదివారం, 4 ఆగస్టు 2024 (09:32 IST)
Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు, మండి, సిమ్లాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మేఘాలు కమ్ముకున్నాయి. వరదల కారణంగా చాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదల్లో మృతి చెందిన ఆరుగురి  మృతదేహాలను ఇప్పటి వరకు వెలికి తీశారు.
 
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన సమాజ్ గ్రామానికి చెందిన అనితా దేవి మాట్లాడుతూ, "మేము రాత్రి నిద్రపోతున్నాం అప్పుడు ఒక్కసారిగా భయంకరమైన శబ్ధం వినిపించి ఇల్లు కంపించింది. బయటకు చూసే సరికి ఊరు జలమయమైంది.
 
ఆ తర్వాత వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని భగవతి కాళి ఆలయంలో తలదాచుకున్నాం. రాత్రంతా అక్కడే ఉండిపోయాం. మా ఇల్లు మాత్రమే బయటపడింది. మా ఊరిలోని ఇళ్లన్నీ నా కళ్ల ముందే కొట్టుకుపోయాయి." అని బాధితులు వాపోయారు. 
 
ఇప్పటి వరకు తప్పిపోయిన వారి సంఖ్య సిమ్లాలో అత్యధికంగా 33 మంది ఉండగా, కులు తొమ్మిది మంది, మండిలో ఆరుగురు ఉన్నారు. మొత్తం 55 మందిని సహాయక శిబిరాలకు తరలించగా, 25 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇంకా 61 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు