మనమిద్దరం - మనకిద్దరు నినాదాన్ని వీడాలి : సాధ్వి రితంబర

మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:04 IST)
దేశం కోసం ప్రతి ఒక్క హిందూ దంపతులు నలుగురు పిల్లలను కనాలని, అందులో ఇద్దరు హిందూ దేశం కోసం అంకితమివ్వాలని సాధ్వి రితంబరం పిలుపునిచ్చారు. అంతకాకుండా మనమిద్దరం మనకిద్దరు అనే నినాదాన్ని విడనాడాలని ఆమె కోరారు. 
 
లక్నోలోని నీరాల నగర్‌లో నిర్వహించిన రామ మహోత్సవ కార్యక్రమంలో హిందుత్వ నేత, దుర్గావాహిని వ్యవస్థాపకురాలు సాధ్వీ రితంబరం మాట్లాడుతూ, హిందూ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలని, వారిలో ఇద్దర్నీ దేశానికి అంకితమివ్వాలని కోరారు. అలా చేస్తేనే దేశం హిందుత్వ రాజ్యమవుతుందన్నారు. 
 
రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారి అంతు చూస్తామని హెచ్చరించారు. మనం ఇద్దరం, మనకు ఇద్దరు విధానాన్ని అనుసరించకూడదని అన్నారు. హిందూ సమాజంలోన సోదరులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని కోరారు. 
 
నలుగురులో ఇద్దరిని ఆర్ఎస్ఎస్‌కు అప్పగిస్తే అతడు ఆర్ఎస్ఎస్ వలంటీరు అవుతారు. వీహెచ్‌పీ కార్యకర్తల అవుతారు. భజరంగ్ దళ్ బజరంగ్ అవుతాడు అంటూ పిలుపునిచ్చారు. మీ నుదిటిపై భరతమాత ధూళిని పూయడం ద్వారా మీ జన్మ ధన్యమవుతుంది అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు