కానీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇటీవల పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. కొత్తగా కరోనా బారిన పడిన చిన్నారులు పలు వ్యాధులకు గురౌతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. తీవ్ర ఆందోళన, డిప్రెషన్, మధుమేహం వంటి వ్యాధుల భారిన పడడం comorbidities (సహ సంబంధ వ్యాధులు) లక్షణాలుని వైద్యులు చెప్తున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు సామాజిక దూరం పాటించాలని, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించడం మొదలైన వాటితో సహా కోవిడ్-19 ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని ఢిల్లీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.