ఆస్తి రాసివ్వకుంటే నీ రక్తం తాగుతా.. కన్నతల్లికి కుమార్తె చిత్రహింసలు (Video)

ఠాగూర్

సోమవారం, 3 మార్చి 2025 (11:19 IST)
ఆస్తి కోసం కన్నతల్లిని ఓ కుమార్తె చిత్రహింసలకు గురిచేసింది. ఆస్తి తన పేరు మీద రాయకుంటే నీ రక్తం తాగుతానుంటి హింసించింది. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మానవత్వానికే మచ్చగా మారిన ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని హిస్సార్‌లో చోటుచేసుకుంది. తల్లిపై తన చెల్లెలు చేసిన దాడిని ఆమె సోదరుడు సీసీటీవీ కెమెరా ద్వారా రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
హిస్సార్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు నగరంలోని మోడర్న్ సాకేత్ కాలనీకి చెందిన రీటాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత భర్తతో గొడవపడి పుట్టింటికి చేరింది. ఆపై భర్తతో సఖ్యత కుదరడంతో భర్తతో పాటు ఆమె అత్తగారిని కూడా పుట్టింటికే పిలిపించుకుంది. తండ్రి చనిపోవడంతో ఒంటరిగా ఉన్న నిర్మలాదేవి ఇంట్లోనేవారంతా ఉంటున్నారు. రీటా సోదరుడు ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలో ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో తల్లిపేరుమీద ఉన్న ఆస్తిపై కన్నేసిన రీటా.. కురుక్షేత్రలో ఉన్న కుటుంబ ఆస్తిని రూ.65 లక్షలు అమ్మించి ఆ డబ్బును తీసుకుంది. ఇంటిని, ఇతర ఆస్తిని కూడా తన పేరు మీద రాయాలంటూ తల్లిపై ఒత్తిడి తెచ్చింది. అందుకు ఆ తల్లి అంగీకరించలేదు. దీంతో ఆమెను ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురిచేయసాగింది. 
 
తనను ఇంటికిరాకుండా అడ్డుకునేందుకు తనపై తప్పుడు కేసులు పెడతానంటూ రీటా బెదిరించేదని అమర్ దీప్ ఆరోపించాడు. ఇటీవల రీటా తల్లిని చిత్రహింసలు పెడుతున్న వీడియోను సంపాదించి, పోలీసులను ఆశ్రయించాడు. తల్లి నిర్మాలాదేవిని రీటా తీవ్రంగా కొడుతూ మీదపడి కొరకడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అమర్ దీప్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో రీటాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

 

TW: Extreme Abuse

A Daughter torturing her Mother

Drawing your attention @cmohry @police_haryana @DGPHaryana

This video is going viral. I don't know from where it is but definitely Haryana

Please find who she is and punish her. This is extremely sick behaviour @NCWIndia pic.twitter.com/47FjAVY5aK

— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) February 27, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు