అయితే, స్కూళ్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ డీజీపీని ఆదేశించింది. కాగా, బెంగాల్‌లో ఇప్పటి వరకు 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా 7,447 మందికి కరోనా బారిన పడ్డారు. 239 మంది ప్రాణాలు కోల్పోయారు.