ఢిల్లీలో మరణ మృదంగం : 24 గంటల్లో కరోనాతో 335మంది మృతి

గురువారం, 6 మే 2021 (17:01 IST)
కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. 
 
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 335మంది కరోనాతో చికిత్స పొందుతూ మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 78,780 కరోనా టెస్టులు చేయగా, 19,133మంది కరోనా బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 24.29శాతంగా ఉంది. 
 
నిన్న ఒక్కరోజే 20,028మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల్లో 21,839మంది పడకలు అందుబాటులోకి 20,117 పడకలు నిండాయి. 1,772 మాత్రమే ఖాళీ ఉన్నాయి. 
 
అలాగే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో 5525 పడకలకు 4824 ఖాళీలు, కొవిడ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో 206 పడకలకు 90 ఖాళీగా ఉన్నాయి. 50,562మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు