భారీగా తగ్గిన బంగారం ధరలు

గురువారం, 12 మార్చి 2020 (05:46 IST)
బంగారం ధరలు భారీగా తగ్గాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పుంజుకోవడంతో ధరలు భారీగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.516 తగ్గింది.

బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 45,033గా నమోదైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ వెల్లడించింది. మరోవైపు వెండి ధరలు మాత్రం రూ.146 మేర పెరగడంతో.. ఇవాళ కిలో వెండి రూ.47,234కు చేరింది. ఇంతకు ముందు వెండి రూ.47,088 వద్ద క్లోజ్ అయ్యింది.

కాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ 36 పైసలు బలపడినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ సీనియర్ ఎనలిస్టు తపన్ పటేల్ మీడియాకు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1661 డాలర్లు, వెండి ధర 17.3 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు