భార్య ఓ ప్రశ్న అడిగింది. అంతే ఆవేశంతో భర్త ఆమె ముక్కు కొరికిపారేశాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, గోటాసర్ ప్రాంతానికి చెందిన రేష్మా గుల్వానీ (40) ఆ ప్రాంతంలో ఓ షాపులో పనిచేస్తుంది. ఈమె భర్త కైలాష్ కుమార్. ఈ దంపతులను ముగ్గురు సంతానం వున్నారు. కైలాష్ ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే వున్నట్లు తెలుస్తోంది.