భార్యతో విభేదాలు తలెత్తడంతో ఓ భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. సుధీర్ఘ విచారణ తర్వాత కోర్టు విడాకులు మంజూరుచేసింది. దీంతో ఆ వ్యక్తి పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. దీంతో ఏకంగా పాలతో స్నానం చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన భర్త పేరు మాణిక్ అలీ.. విడాకులను పాల స్నానంతో అలీ సెలెబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎందుకింత సంబరం అని అడిగితే తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడని, మాణిక్ అలీ చెప్పాడు. తనతో వివాహమై ఓ బిడ్డ పుట్టినా ఆమె తన ప్రియుడుతో ఉన్న అక్రమ సంబంధం కొనసాగించిందని ఆరోపించారు. తనను తన బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందన్నాడు. ఒక్కసారిగా కాదు రెండుసార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు. మొదటిసారి తప్పు చేసినపుడు బిడ్డ కోసం తాను ఆమెను క్షమించానని చెప్పాడు.