తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాక్డౌన్ కారణంగా పలు విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగిస్తున్నాయి. అయితే, ఇది పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పూట గడవడానికే ఇబ్బందులు పడే పేద విద్యార్థులు ఆన్‌లౌన్ క్లాసుల సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు.
ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకావడానికి తన వద్ద టీవీ, స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఓ విద్యార్థిని (14) ఆత్మహత్య చేసుకుంది. ఆన్‌లైన్ తరగతులకు దూరమవుతున్నానన్న మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ బాలిక. అనంతరం వాలంచెరిలోని ఇంటి సమీపంలో ఆమె విగతజీవిగా కనపడింది.