బీహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ బమ్రా కొందరు విద్యార్థినులతో ఓ వర్క్ షాపు నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ, ఉచితంగా వస్తాయంటే అమ్మాయిలు కూడా కండోమ్‌లు కూడా కావాలాంటారేమో అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె దిగివచ్చి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
కండోమ్ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. తాను ఏ ఒక్క మనోభావాలను దెబ్బతీయాలని అలా వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. ఆ వర్క్ షాపులో ఓ ఒక్క అమ్మాయి. అయినా నా వ్యాఖ్యల పట్ల నొచ్చుకునివుంటే అందుకు చింతిస్తున్నానని హోర్జోత్ కౌర్ పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. పైగా, తాను చేసిన వ్యాఖ్యలను మరో కోణంలో మీడియా వక్రీకరించిందంటూ చిర్రుబుర్రులాడారు.