గోవా ఎమ్మెల్యే మైఖేల్ లోబో రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. ఉత్తర గోవాలోని కలాంగూట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లోబో మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో గోవాను సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
గోవా బీచ్‌లలో బెంగళూరుకు చెందిన వడా పావ్ వంటి ఆహార పదార్థాలను అమ్ముతుండగా, మరికొందరు ఇడ్లీ, సాంబారు అందిస్తున్నారని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా విదేశీ పర్యాటకుల రాక తగ్గడానికి ఇటువంటి కార్యకలాపాలు దోహదపడుతున్నాయని లోబో పేర్కొన్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం పర్యాటక రంగంపై కూడా ప్రభావం చూపిందని, ఈ దేశాల నుండి సందర్శకులు ఇకపై గోవాకు రావడం లేదని పేర్కొన్నారు. లోబో కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి.