ఈ ఒక్క తప్పుచేస్తే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ, ఎస్బీఐ హెచ్చరిక

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (21:13 IST)
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలను సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా మోసం చేస్తూ వారి నుండి డబ్బులు కాజేస్తున్నారు. ఫోన్, ఎస్ఎంఎస్, మెయిల్స్ ఇలా ఏదో ఒక రూపంలో మోసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమం లోనే ఎస్బీఐ  ఓ ప్రకటన చేసింది.
 
అంతేకాదు సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే క్షణాల వ్యవధిలో మీ ఖాతాలో బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను హెచ్చరించింది. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ప్రజలు అలర్ట్‌గా ఉండకపోతే మోసపోతారని వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఎలా  మోసపోతున్నారో తెలిపింది.
 
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో గడుపుతున్నారు. వాట్సాప్ లక్ష్యంగా చేసుకొని లింకులు పంపి మీ బ్యాంకు ఖాతా నగదును లాగేస్తున్నారు. ఏదో అదృష్టం వరించింది కోటీశ్వరులు అయిపోతాం అని ఆశపడితే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం శూన్యమవుతుంది.
 
మీరు లాటరీ గెలచుకున్నారని మీకు ప్రైజ్ మనీ మీ అకౌంట్లో వేస్తామని మీ దగ్గర ఉన్న బ్యాంకు పర్టికులర్స్‌ను లాగేస్తారు. కానీ ఎస్బీఐ ఖాతాదారులకు ఎలాంటి లాటరీ స్కీం లేదని స్పష్టం చేసారు. కేవలం ఈ విషయాన్ని నమ్మించే దానికోసం ఇలాంటి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా మీకు పంపివేస్తారు. లక్కీ కస్టమర్ గిప్ట్ కూడా మేము అందించడం లేదు. ఎప్పుడు కూడా ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ కాల్స్ రూపంలో మీ వివరాలను బ్యాంకు సిబ్బంది అడగరని గుర్తించుకోండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు