వచ్చే 24 గంటల తర్వాత పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో వాయుగుండంగా మారొచ్చని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు.
అల్పపీడనంతో పాటు, ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం, ఈశాన్య ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాల్లో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి.