తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎంపీలు జైలు ఊచలు లెక్కించేలా చేసిన రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు ప్రస్తుతం సెక్స్ స్కామ్‌గా సరికొత్త మలుపు తిరిగింది. ఇదే అంశం త్వరలో పార్లమెంటులోనూ హల్‌చల్ చేసే సూచనలు లేకపోలేదు. చిట్‌ఫండ్ కేసును విచారిస్తున్న నోడల్ అధికారి మనోజ్ కుమార్ లేదా అచ్చం అలాగే ఉన్న ఓ వ్యక్తి... సుభ్ర కుండును పోలిన ఓ మహిళతో ఢిల్లీలోని ఓ హోటల్‌లోకి వెళ్లినట్టు వీడియో ఫూటేజిలో వెల్లడయింది.