కాగా, ఈ అగ్ని-3 క్షిపణి శ్రేణిలో గతంలో 2006 జూన్ 9వ తేదీన మొదటిసారిగా ప్రయోగించారు. ఈ క్షిపణఇ అణు వార్‌హెడ్ తీసుకెళ్లి 3500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. రెండో క్షిపణిని 2007లో విజయవంతంగా ప్రయోగించారు. 2008లో వరుసగా మూడోసారి ప్రయోగించారు. ఇపుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్షిపణిని ప్రయోగించగా అది పూర్తిగా విజయవంతమైంది.