ఫోనులో చిన్నారుల అశ్లీల వీడియోలు.. ఆస్ట్రేలియాలో భారతీయుడి అరెస్టు

గురువారం, 31 జనవరి 2019 (18:38 IST)
ఫోనులో అశ్లీల వీడియోలు కలిగివున్న భారతీయ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. పెర్త్ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కౌలాలంపూర్ నుంచి ఆస్ట్రేలియాకు 32 ఏళ్ల భారతీయుడు వెళ్లాడు. పెర్త్ విమానాశ్రయంలో దిగిన అతడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. లగేజీలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. 
 
కానీ, అతని చేతిలో ఉన్న రెండు ఫోన్లను కూడా చెక్ చేశారు. వాటిని చూసిన వెంటనే అధికారులు ఖంగుతిన్నారు. ఫోన్లలో ఐదు అశ్లీల వీడియోలు ఉండటంతో వారు షాక్‌కు గురయ్యారు. వాటిల్లో ఓ రెండు చిన్న పిల్లలతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. వెంటనే అతడిని ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 
 
వాస్తవానికి ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. అలాంటి వీడియోలను దేశంలోకి తీసుకురావడం నిషేధం. అశ్లీల వీడియోలను చాలా దేశాల మాదిరిగానే ఆస్ట్రేలియా కూడా నిషేధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘింస్తే కఠిన చర్యలు ఉంటాయి. 
 
ఈ నిబంధనలు తెలిసో తెలియకో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే ఇతర దేశస్థుల ఫోన్లలో ఇలాంటి అశ్లీల వీడియోలు ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. ఇపుడు 32 యేళ్ళ భారతీయ వ్యక్తిని కూడా ఈ నేరం కిందే అదుపులోకి తీసుకుని పెర్త్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న అతడికి.. దాదాపు 3.75 కోట్ల రూపాయల జరిమానా కానీ, పదేళ్ల జైలు శిక్ష కానీ విధించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు