వందే భారత్ స్లీపర్ రైలు.. మార్చి 2024 కల్లా పూర్తి

శనివారం, 16 సెప్టెంబరు 2023 (12:42 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైల్వే ప్రాజెక్ట్ వందే భారత్. ఈ రైలు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తోంది. వందే భారత్ ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ రైలును నడుపుతోంది. కానీ ఇప్పుడు దాని వెర్షన్ స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నడపబోతున్నట్లు ప్రకటించింది. 
 
అంతేకాకుండా త్వరలో వందే మెట్రో రైలును కూడా ప్రవేశపెట్టనున్నారు. నాన్ ఏసీ ప్రయాణీకుల కోసం అక్టోబర్ 31న నాన్ ఏసీ పుష్ పుల్ రైలును ప్రారంభించించనున్నట్లు మాల్యా తెలిపారు. ఇందులో 22 కోచ్‌లు, ఒక లోకో మోటివ్ వుంటుంది. 
 
వందే భారత్ స్లీపర్ రైలు కోచ్‌గా మారేందుకు సిద్ధంగా వుందన్నారు. అదే సమయంలో మెట్రో కోచ్‌లను సిద్ధంగా వుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బిజి మాల్యా వెల్లడించారు. 
 
స్లీపర్ రైలులో 11 కోచ్‌లు వుంటాయి. మూడు టైర్ కోచ్‌లు, నాలుగు టైర్ కోచ్‌లు, నాలుగు టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ టైర్ కోచ్‌లతో కలిసి మొత్తం 16 కోచ్‌లను ఈ రైలుకు చేర్చనున్నట్లు మాల్యా చెప్పారు. ఈ రైలును మార్చి 31, 2024 లోపు ప్రారంభిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు