ఐపీఎస్ అధికారుల బదిలీ కేసును వాయిదా వేసిన హైకోర్ట్

శుక్రవారం, 29 మార్చి 2019 (14:04 IST)
ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 28(ఏ) పరిధిలోకి రాని అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడాన్ని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. అయితే హైకోర్టు తీర్పును వెలువరించకుండా వాయిదా వేసింది. 
 
ఈ సందర్భంగా కేరళ, మద్రాసు హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను ఏజీ ఉదాహరణగా చెప్పారు. అయితే ఐపీఎస్ అధికారుల బదిలీల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని ఈసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. 
 
ఈ బదిలీల్లో ఒకరి బదిలీని రద్దు చేస్తూ జీవో 720 తెచ్చారని ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే సెక్షన్ 28 (ఏ) పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాబిలో డీజీ పేరును ప్రభుత్వమే ఇచ్చిందని ఈసీ తరపున లాయర్ వాదించారు.
 
దీనికి ఏజీ జవాబిస్తూ పొరపాటున ఇంటెలిజెన్స్ డీజీ పేరును ఇచ్చామని వివరణ ఇచ్చారు. ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తే డీజీ విషయంలోనే ప్రభుత్వానికి ఎందుకంత అభ్యంతరం అని ఈసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అయితే హైకోర్టు తీర్పును వెలువరించకుండా వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు