ఇంట్లోనే కాకుండా విమానంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్న వేళ.. భర్త ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్‌ను.. నిద్రపోతున్న భర్త వేలిముద్రలతో అతని ఫోన్ అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించిన భార్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇరాన్‌కు చెందిన భార్యాభర్తలు చెన్నై నుంచి విమానంలో బాలీఖతార్ వెళ్తున్నారు. అప్పటికే భర్త తనను మోసగిస్తున్నాడన్న అనుమానంతో వున్న భార్య, అతడి ఫోన్ సమాచారం తెలుసుకోవాలని భావించింది. దీంతో నిద్రపోతున్న భర్త వేలిముద్రల సాయంతో అతని స్మార్ట్ ఫోన్ అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఊహించని విధంగా అతనికి మెలకువ వచ్చేసింది. అంతే భార్యపై ఫైర్ అయ్యాడు.