వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం తన తాజా సినిమా మణికర్ణికపై దృష్టి సారించింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో వివాదం, పురుషాధిక్యంపై కామెంట్లు వీడియోలు పోస్టు చేస్తూ వివాదాల వెంట తిరుగుతూ వచ్చిన కంగనా రనౌత్ రూటు మార్చింది.
ఈ సినిమాకు స్టంట్ డైరెక్టర్‌గా హాలీవుడ్‌కి చెందిన నిక్ పావెల్ వ్యవహరిస్తున్నారు. నిక్ పావెల్ సమక్షంలో ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న సోనూ సూద్, అంకిత లోఖాండే, వైభవ్ తత్వావాడిలు కూడా కసరత్తులు చేస్తున్నారు. ఏప్రిల్ 27, 2018న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.