బుధవారం సాయత్రం సరిగ్గా 4 గంటల 10 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్2 ఎఫ్ 11 రాకెట్ ద్వారా 2,250 కేజీల బరువైన ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీశాట్ 7ఏ వైమానిక రంగానికి 8యేళ్ల పాటు సేవలు అందించనుంది. సమాచార ఉపగ్రహ శ్రేణిలో జీశాట్ 7ఏ మూడోది. కేవలం నెలరోజు వ్యవధిలోనే ఇస్రో మూడు ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేయడం గమనార్హం.
ఈ ప్రయోగం వల్ల ఇంటర్నెట్, అడవులు, సముద్రాలు, వ్యవసాయరంగ సమాచారాన్ని సేకరించనున్నారు. జీశాట్7ఏ ఉపగ్రహంతో దేశంలో మరింత వేగవంతమైన, విస్తృతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి మరింత సులభతరంకానుంది.