మహారాష్ట్రలో ఐటీ పంజా : అజిత్ పవార్ కుటుంబ ఆస్తుల జప్తు

మంగళవారం, 2 నవంబరు 2021 (14:51 IST)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన కుటుంబానికి చెందిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు. తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో ఒక్క జరందేశ్వర్ కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం విలువే రూ.600 కోట్లు ఉంటుందని అంచనా.
 
ఇది సతారాలో ఉంది. ఇది కాకుండా అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు చెందిన కార్యాలయం (రూ.25 కోట్లు), సౌత్ ఢిల్లీలో ఓ ఖరీదైన ఫ్లాట్ (రూ.20 కోట్లు), ముంబై నారిమన్ పాయింట్‌లోని నిర్మల్ టవర్‌తో పాటు గోవాలోని ఓ రిసార్టు సహా పలు ఆస్తులను ఐటీ అధికారులు జప్తు చేశారు.
 
అక్టోబరులో అజిత్ పవార్ తోబుట్టువులు, సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసిన విషయం తెల్సిందే. కేంద్రం కావాలనే తమపై దాడులు చేయిస్తోందని అజిత్ పవార్ ఆరోపించారు. 
 
తాము పన్నులు సక్రమంగానే చెల్లిస్తున్నామని అన్నారు. తాజా ఐటీ దాడులపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య స్పందిస్తూ, జప్తు చేసిన ఆస్తులు అజిత్ పవార్ కుమారుడు, భార్య, తల్లి, సోదరి, అల్లుడి పేరు మీద ఉన్నాయని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు