అంతకుముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ఐటీ శాఖను ఈ సోదాలకు కేంద్రం ఉసిగొల్పినట్టుగా ఉందనే విమర్శలువస్తున్నాయి. మరోవైపు, సోనూ సూద్ నివాసాల్లో ఐటీ అధికారులు సర్వే చేశారనే వార్త సంచలనంగా మారింది.