లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ చేసుకున్న ఒప్పందాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీల్‌కు సంబంధించి పన్ను ఎగవేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపైనే దర్యాప్తు సాగుతోందని ఓ అధికారి చెప్పారు. ఈ తనిఖీలు కేవలం సర్వే మాత్రమేనని చెప్పుకొచ్చారు.
బుధవారం ముంబైలోని జుహులో ఉన్న సోనూ స్వచ్ఛంద సంస్థతో పాటు ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులు, ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. 20 గంటల పాటు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, ప్రతిపక్షాలు ఈ దాడులపై మండిపడుతున్నాయి.