తాజ్‌మహాల్ నిర్మించిన స్థలం మాది అంటున్న బీజేపీ ఎంపీ దియాకుమారి

గురువారం, 12 మే 2022 (14:25 IST)
ప్రేమసౌథం తాజ్‌ మహాల్ నిర్మించిన స్థలం తమ కుటుంబానికి చెందినదని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ దియాకుమారి మీర్జా అంటున్నారు. తమదైన ఈ స్థలాన్ని అప్పట్లో షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. స్థలం స్వాధీనం చేసుకున్నప్పటికీ అప్పట్లో ఇచ్చిన పరిహారం అంతంతమాత్రమేనని అన్నారు. దీనిపై నాడు పోరాడేందుకు కోర్టులు లేవన్నారు. అదేసమయంలో తాజ్‌మహాల్ సమాధుల కింద ఏముందో తేలాలని ఈ జైపూర్ మాజీ యువరాణి అంటున్నారు. 
 
తాజ్‌మహాల్ కింద ఉన్న 22 గదులను తెరిచి, అందులో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయేమో తేల్చాలని కోరుతూ అలహాదాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో దియా కుమారి మీర్జా స్పందించారు. తాజ్ మహాల్ నిర్మించిన స్థలం తమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
"భూమికి సంబంధించి పరిహారం ఇచ్చారు. కానీ, ఎంత మొత్తం? దీన్ని ఆమోదించిందీ లేనిదీ నేను చెప్పలేను. ఆ రికార్డులను నేను చదవలేదు. కానీ, ఆ భూమి మాత్రం మాదే. షాజహాన్ స్వాధీనం చేసుకున్నాడు. ఆ కాలంలో ఏ న్యాయస్థానాలు లేవు. అప్పీల్ చేసే అవకాశం కూడా లేదు. అందుకే రికార్డులు అధ్యయనం చేయాలి. అపుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి" అని ఆమె చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు