ఏ1గా చంద్రబాబు - ఏ2గా నారాయణ.. ఆర్కే ఫిర్యాదుతో కేసు నమోదు

మంగళవారం, 10 మే 2022 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకునేందుకే అధిక సమయం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. రాజధాని అమరావతి కోసం సేకరించిన భూముల సేకరణ (ల్యాండ్ పూలింగ్)లో ఎలాంటి అవినీతి జరగలేదని, ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ సాక్షాత్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. 
 
ఈ క్రమంలో అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో అవినీతి జరిగిందంటూ గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణ పేర్లను చేర్చారు. 
 
అలాగే, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను పేర్కొన్నారు. మొత్తం 14 పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. 2014-19 మధ్యకాలంలో చేపట్టిన భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆర్కే చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు