తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. జల్లికట్టును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జల్లికట్టు పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది జల్లికట్టులో 2,600 ఎద్దులు పాల్గొంటుండగా, వాటిని అదుపు చేసేందుకు తాము సిద్ధమని 3400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
మొత్తం 64 చోట్ల పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోటీలు జరిపే బరులు ఉండాలని, పశువులను హింసించరాదని, వైద్యులు అందుబాటులో ఉండాలని పళనిస్వామి సర్కార్ ఆదేశించింది. అవనియపురం, పాలమేడు, అనంగానల్లురు తదితర ప్రాంతాల్లో పశువులను కట్టడి చేసే యువత సాహసాలను తిలకించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.