యూపీ పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు అమ్మాయి!

సోమవారం, 5 జులై 2021 (11:38 IST)
Telugu girl
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలిచి సత్తా చాటింది. మొత్తం 75 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఏకంగా 67 సీట్లలో విజయం సాధించింది.

ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంచుకోటగా ఉన్న రాయబరేలీలోనూ బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. 
 
ఇక ఈ యూపీ పరిషత్ ఎన్నికల్లో తెలుగు అమ్మాయి సత్తా చాటింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యారు. శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యారు. 
 
మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె అయిన శ్రీకళారెడ్డి యూపీలో స్థిరపడ్డారు. గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో తన తండ్రి గారి తరఫున చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహమైంది. అనంతరం బీజేపీలో చేరారు. ఇటీవల అక్కడ జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జాన్పూర్‌ పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు