నరేంద్ర మోడీ పాస్‌పోర్ట్ వివరాలు ఇవ్వాల్సిందే: యశోదాబె‌న్‌కు షరతు

గురువారం, 11 ఫిబ్రవరి 2016 (13:06 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోడీ భార్య జశోదాబెన్.. మోడీ పాస్‌పోర్టు వివరాలను ఇవ్వాలని కోరారు. మోడీ సతీమణి జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద అహ్మదాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయానికి ఓ దరఖాస్తు చేశారు. అయితే భర్త మోడీ పాస్ పోర్టులోని వివరాలు తెలపాలంటూ అందులో కోరారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులను కలిసేందుకు వెళ్లాలని యశోదాబెన్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు.
 
ఈ క్రమంలో గత ఏడాది నవంబరులో యశోదాబెన్ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెళ్ళి సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా పాస్‌పోర్టు ఇవ్వలేమని అధికారులు తేల్చిచెప్పారు. అనంతరం పెళ్లి సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా.. మోడీ పాస్‌పోర్టు వివరాలు కావాల్సిందేనని యశోదాబెన్‌కు అధికారులు తెలిపారు. తన సోదరుడు, బంధువులతో కలిసి వెళ్ళినా పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బంది భర్త పాస్‌పోర్టు వివరాలు ఇవ్వాల్సిందేనని ఇవ్వాలని తేల్చి చెప్పారు. అయితే ఆమె దరఖాస్తును పరిశీలిస్తున్నామని, ఒక నెల రోజుల్లో సమాధానమిస్తామని ఆర్‌పీఓ అధికారి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి