అయితే, ఆమె ఆరోగ్యంలో కాస్తంత మెరుగుపడినప్పటికీ... పూర్తి స్థాయిలో కుదుటపడలేదు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సింగపూర్‌కు తరలించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అపోలో ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు ప్రజలు 'అమ్మ'గా పిలుచుకునే జయలలిత... త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు.