తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పును సవరించాలంటూ.. గత నెలలో కర్ణాటక సర్కారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తోసిపుచ్చింది. జయలలితను దోషిగా తేల్చడంతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధించాలని కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంను విజ్ఞప్తి చేసింది.