మా అత్త శశికళ త్యాగశీలి అని, అపోలో ఆస్పత్రిలో ఆమెకు, జయలలితకు ముధ్య జరిగిన సంభాషణల వీడియోను బహిర్గతం చేస్తానంటూ శశికళ అన్న కుమారుడు జయానంద్ దివాకరన్ తాజాగా ప్రటించారు. ఈ మేరకు ఆయన ఈనెల 7వ తేదీన తన ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని కామెంట్స్ చేశారు.
కానీ ఓపీఎస్ కేవలం ఓట్ల కోసం పురచ్చితలైవిని శవపేటికలో పెట్టి ప్రచారం చేశారు. నిజం నిప్పులాంటిది. ఏదో ఒక రోజున అమ్మ, చిన్నమ్మ (శశికళ) మధ్య ఆస్పత్రిలో జరిగిన సంభాషణలు వెల్లడైతే...? పీహెచ్ పాండ్యన్, మనోజ్ పాండ్యన్, పన్నీర్‌సెల్వం వంటి వారిని ఏం చేయాల్సి ఉంటుందో? ఆ రోజు త్వరలోనే..!' అని జయానంద్ తన ఖాతాలో పేర్కొన్నారు.