జార్ఖండ్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మహిళలు సమాజంలో ఒంటరిగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించే దిశగా.. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన పేరుతో వితంత పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది.
ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించదు. ఇందుకోసం వివాహ తేదీ నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. దీంతోపాటు దివంగత భర్త మరణ ధ్రువీకరణ పత్రం జతచేయాల్సి ఉంటుంది.