ఈ కథనాల మేరకు కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర రక్షణ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రిగానూ, కేంద్ర హోం మంత్రిగా అమిత్ షాలు నియమితులు కానున్నట్టు సమాచారం.
మరోవైపు, అమిత్ షా... కేంద్ర హోం మంత్రిగా నియమితులైన తర్వాత బీజేపీ చీఫ్‌గా కేంద్ర ఆరోగ్య మంత్రిగా జేపీ నడ్డా నియమితులు కానున్నారు. 59 యేళ్ళ నడ్డా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు.
అయితే, ఆయన ఎక్కువ ప్రచారంలో లేకపోయినప్పటికీ మంచి వ్యూహకర్తగా పేరుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలను కూడా ఆయన చూసుకున్నారు. ఈయన సారథ్యంలో యూపీలోని మొత్తం 80 సీట్లకు గాను బీజేపీ 62 చోట్ల విజయం సాధించింది. పైగా, అమిత్ షా - జేపీ నడ్డాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.