తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కేంద్రంలో ఓ ఐస్ క్రీమ్ పార్లర్లో రహస్యంగా సాగుతున్న వ్యభిచార గట్టును స్థానిక పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు విటులతో పాటు.. యువతులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన విటుల్లో స్థానిక అన్నాడీఎంకే నేత సైతం ఉండటం గమనార్హం. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కన్యాకుమారి జిల్లా కేంద్రంతో పాట.. నాగర్‌కోయిల్‌లో పలు ఐస్‌క్రీం పార్లర్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ప్రత్యేక గదుల్లో యువ జంటల రాసలీలలకు వీలు కల్పిస్తున్నారు. వీటికి ముఖ్యంగా పాఠశాల, కళాశాలలకు చెందిన యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులకు పలు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి.
ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐస్‌క్రీం పార్లర్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒక ఐస్‌క్రీం పార్లర్‌పై దాడి జరిపిన ఘటనలో పలువురు అమ్మాయిలతో పాటు.. విటులను అరెస్టు చేశారు. ఇలా అరెస్టు చేసిన విటుల్లో అధికార అన్నాడీఎంకే నేత కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి కారణంగా ఈ నేతను విడుదల చేశారు. మిగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.