కాంగ్రెస్ పార్టీకి షాక్ - టాటా చెప్పిన కపిల్ సిబల్

బుధవారం, 25 మే 2022 (15:41 IST)
కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, న్యాయకోవిదుడు కపిల్ సిబల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అదేసమయంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సమాజ్‌‍వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ కానున్నారు.  
 
ఇదిలావుంటే, తాను ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీలో బుధవారం చేరారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై అఖిలేష్ యాదవ్  స్పందిస్తూ, ఎస్పీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్పీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. తమ పార్టీ తరపున నామినేట్ చేసే ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు సిబల్ అని మరో ఇద్దరు పేర్లు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు