25 ఏళ్లుగా ఒకే కుటుంబానికి తప్పని పాముకాటు.. ఐదుగురు మృతి

శుక్రవారం, 26 ఆగస్టు 2022 (20:03 IST)
25 ఏళ్లుగా ఒక కుటుంబాన్నే పాములు టార్గెట్ చేస్తున్నాయి. ఆ కుటుంబానికి నాలుగేళ్లకు ఒకసారి పాము కాటు తప్పదు. కర్ణాటక తుమకూరు జిల్లాలోని తొగరిఘట్ట గ్రామానికి చెందిన ఓ ఉమ్మడి కుటుంబం వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. 
 
గత 25 ఏళ్లలో ఆ కుటుంబానికి చెందిన 12 మంది పాముకాటుకు గురయ్యారు. వారిలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాముకాటుకు గురవ్వడం, అందులోనూ పురుషులకే ఆ ప్రమాదం జరుగుతుండటం.. ఆ కుటుంబీకులను భయాందోళనకు గురిచేస్తోంది.
 
ఇటీవల కుటుంబంలోని గోవిందరాజు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పాముకాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ధర్మన్న కుటుంబానికి చెందిన పొలంలో పని చేసేందుకు వెనకాడుతున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు