కర్నాటక రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిందో బాలిక. తరగతి గదిలోనే ఆ బాలిక తుదిశ్వాస విడవడం సహచర విద్యార్థులు బోరున విలపించారు. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇలా మృత్యువాత పడుతున్నవారిలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పోయింది. తాజాగా మూడో తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో చనిపోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. కర్ణాటక, చామరాజనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
కాగా, గత నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్లో ఆటలు ప్రాక్టీస్ చేస్తుండగా నాలుగేళ్ల కుర్రాడు గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటకే బాలుడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
అంతకుముందు సెప్టెంబరు నెలలో అదే రాష్ట్రంలోని లక్నోలో 9 ఏళ్ల బాలిక పాఠశాల క్రీడా మైదానంలో ఆడుకుంటూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. కాగా, కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగినట్టు వోకార్డ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత రెండు నెలలుగా 15 నుంచి 20 శాతం అధికంగా ఇలాంటి కేసులు వస్తున్నట్టు పేర్కొన్నాయి.