కాంగ్రెస్ పార్టీలోకి కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్‌

సోమవారం, 17 ఏప్రియల్ 2023 (15:07 IST)
బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి వైదొలగిన కొద్ది సేపటికీ కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 
 
బెంగళూరులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్యతో శెట్టర్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ నేతలను కలిసేందుకు హుబ్బళ్లి నుంచి బెంగళూరుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. 
 
జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. పార్టీ ఢిల్లీ కీలక పదవులు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు