సోమవారం రాత్రి గీతమ్మ ఇంటికి వచ్చిన ఆశ, సంతోశ్ దెయ్యం వదిలించే పూజలు మొదలుపెట్టారు. ఈ తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో అర్థ స్పృహలో ఉన్న గీతమ్మ తలపై నిమ్మకాయతో కొట్టడం, జట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టడం వంటి దృశ్యాలు ఉన్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, గీతమ్మ కొడుకు సంజయ్‌తో పాటు భూతవైద్యం పేరుతో దాడికిపాల్పడిన ఆశ, ఆమె భర్త సంతోశ్‌ను అరెస్టు చేశారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.