ఇలా చెప్పిన ఆ మహిళ తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ కర్నాటక బాగల్కొటే జిల్లా ఎస్పీ నాగరాజుకు మొరపెట్టుకుంది. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పి ఆసుపత్రిలో చేరింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతున్నట్లు చెప్పి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత తమకు కనిపించడంలేదంటూ పోలీసులు చెపుతున్నారు. మంత్రి సెక్స్ టేపులు నేపధ్యంలో ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.