ప్రధానంగా కొట్టాయం, పథనంమిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీనష్టం వాటిల్లింది. వీటితోపాటు ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇడుక్కి జిల్లాలో శనివారం సాయంత్రం 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది.
అటు, ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుళ నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. గతంలో వరద అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలు హడలిపోతున్నారు.