కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమాన పైలట్లతో సహా మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పైగా, ఇక్కడికి వచ్చే విమానాలన్నింటినీ కోచి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ దీపక్ సాతే, ఆయన కో పైలట్ అఖిలేష్ కుమార్‌తో పాటు మొత్తం 20 మంది వరకు మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది సహా 190 మంది ఉన్నారని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది.