కేరళ కోజికోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం స్కిడ్... ఇద్దరు మృతి, ఇంకా...

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (21:06 IST)
దుబాయ్ నుంచి ప్రయాణిస్తున్న 190 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం సాయంత్రం కేరళ కోజికోడ్‌లో దిగేటప్పుడు రన్‌వేపై స్కిడ్ అయ్యింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరు మరణించారు.
 
ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దిగబోతోంది. రన్‌వేను ఓవర్‌షూట్ చేసిన తరువాత, విమానం ముక్కలుగా విరిగింది. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో జరుగగా ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది.

 
సహాయక చర్యలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు