ప్రిన్సిపాల్ ఓవరాక్షన్.. తలుపులు తెరిచి వుంచే విద్యార్థినులు దుస్తులు మార్చుకోవాలట..

మంగళవారం, 7 మార్చి 2017 (18:22 IST)
కేరళలోని కొల్లం ఉపాసన నర్సింగ్ కాలేజీ గతవారం నుంచి మూతపడింది. కళాశాల ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నారని.. ముఖ్యంగా నిమ్న కులాల వారిపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారని.. వారిపై భారీ జరిమానాలు విధిస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా తమపై కళాశాళ అధికారులు వివక్ష చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
సోమవారం కళాశాల విద్యార్థినులు  ధర్నా చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని నెలల పాటు తమ వేధింపులకు పాల్పడుతున్నారని.. దుస్తులు మార్చుకునేటప్పుడు కూడా గదులకు తలుపు వేయకూడదని తమను ఆదేశించారని విద్యార్థినులు తెలిపారు. 
 
హోమో సెక్సువల్ యాక్టివిటీస్‌కు పాల్పడే అవకాశం ఉందని కారణం చెప్తూ ఈ ఆదేశాలు ఇచ్చారన్నారు. తాము పోర్న్ చూసే అవకాశం ఉందని చెప్తూ తమను గ్రంథాలయంలో ఇంటర్నెట్ కూడా ఉపయోగించుకోనివ్వడం లేదని ఉపాసన కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి