ఫేస్‌బుక్ మంచికి ఏమాత్రం ఉపయోగపడుతుందో గానీ.. నేరాలకు బాగానే యూజ్ అవుతోంది. ఫేస్‌బుక్ ద్వారా నేరాల సంఖ్య పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఫేస్‌బుక్‌లో నగ్న ఫోటోలు పోస్ట్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా అలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్ ద్వారా వదినమ్మ నగ్న చిత్రాలను ఓ గాయకుడు ఫేస్‌బుక్‌లో ఉంచాడు.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి నగరానికి చెందిన జె. నవీన్ అనే సింగర్ ఓ ఫేక్ అకౌంట్ ద్వారా తన వదిన నగ్న చిత్రాలను పోస్ట్ చేశాడు. దీనిపై పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 67 (ఎ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయకుడు నవీన్.. రాణి పీరవోమ్ పేరిట ఫేస్ బుక్ నకిలీ ఖాతాను సృష్టించి తనతోపాటు మరో అయిదుగురి ఫోటోలను అమర్యాదకరమైన హెడ్డింగ్‌తో పోస్టు చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.
ఇంకా తాను నడిపే చాక్లెట్ తయారీ కంపెనీ బిజినెస్ పేజీలోనూ ఆ ఫోటోలు ఉంచాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఫేస్‌బుక్ ఐపీ అడ్రసు సాయంతో దర్యాప్తు చేస్తున్నామని సైబర్ సెల్ సర్కిల్ ఇన్ స్పెక్టరు పీకే శివన్ కుట్టీ చెప్పారు. కాగా బాధితురాలి సోదరిని నవీన్ జులై 12వ తేదీన వివాహం చేసుకున్నాడని.. వివాదాలతో విడిపోయిన కారణంగా వదిన ఫోటోలను అలా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడని విచారణలో తేలింది.