గతంలో కూడా కేరళలో ఇలాంటి ఘటనలు జరిగి వున్నాయి. అర్హత ప్రకారం వైద్యుడైన వేణు, మురళీధరన్ ఇద్దరూ 1990 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందినవారు. జూన్ 2023లో అత్యంత సీనియర్ బ్యూరోక్రాట్‌గా ఉండి, సెంట్రల్ డిప్యూటేషన్‌లో ఉన్న డాక్టర్ మనోజ్ జోషి కేరళకు తిరిగి వచ్చి ఉంటే, ఈ అత్యున్నత పదవి వారికి మిస్ అయ్యేది.
జోషి ఢిల్లీలోనే ఉండేందుకు ఇష్టపడినందున, తదుపరి సీనియర్ అధికారి వేణు, గతేడాది జూన్‌లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జోషి 2027 వరకు పదవిలో ఉంటారు. మురళీధరన్, ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత సీనియర్ బ్యూరోక్రాట్, అందుకే ప్రతిష్టాత్మకమైన పదవిని పొందారు.